కాసేపట్లో పెళ్లి ఉండగా.. వడదెబ్బతో పెళ్లికొడుకు మృతి
Mancherial పెళ్లికొడుకు మృతితో ఆగిన పెళ్లి
కాసేపట్లో పెళ్లి ఉండగా.. వడదెబ్బతో పెళ్లికొడుకు మృతి
Mancherial: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. వరుడు వడ దెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుడ్లభోరీ గ్రామానికి తిరుపతికి ఇటివలే పెళ్లి నిశ్చమయమైంది. మంచిర్యాల జిల్లా భీమినికి చెందిన యువతితో అతని పెళ్లి కుదిరింది. ఈరోజు మధ్యాహ్నం వారి పెళ్లికి ముహుర్తం నిర్ణయించారు. పెళ్లి కొడుకు తిరుపతి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. పెళ్లి పత్రికలు కూడా తిరుపతే పంపిణీ చేశాడు. పెళ్లి పనులు చేసి వడదెబ్బకు గురైన తిరుపతి కన్నుమూశాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి భాజాలు మొగాల్సిన ఇంట్లో చావు డప్పులు వినిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది.