Revanth Reddy: కొత్త రాజ్యాంగం రాయాలనడం దేశద్రోహమే
Revanth Reddy: కేసీఆర్ మీద రాష్ట్రవ్యాప్తంగా దేశద్రోహం కేసులు పెడతాం
Revanth Reddy: కొత్త రాజ్యాంగం రాయాలనడం దేశద్రోహమే
Revanth Reddy: రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దేశద్రోహం కేసు పెట్టాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ రాజ్యాంగ బద్ధంగా పదవులు అనుభవిస్తోందని, ప్రజలు కూడా ఆయన ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా ప్రజాస్వామ్యబద్ధంగా ఓడించాలని చూస్తున్నారే తప్ప మూకుమ్మడిగా ఎదురుతిరగడం లేదన్నారు.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన మీద కేసు పెట్టాల్సిందిగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో రేవంత్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ యంత్రాంగం ఫిర్యాదులు చేస్తుందని చెప్పారు.