Pawan Kalyan: మెడికో ప్రీతి మరణం అత్యంత బాధాకారం
Pawan Kalyan: మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్.. వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
Pawan Kalyan: మెడికో ప్రీతి మరణం అత్యంత బాధాకారం
Pawan Kalyan: మెడికో ప్రీతి మరణం అత్యంత బాధాకరమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చెప్పారు. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకొంటే హృదయం ద్రవించిందన్నారు. తమ బిడ్డను సైఫ్ వేధిస్తూ, కించపరుస్తూ ఉన్నాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ బాధ్యులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదన్నారు.
ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు పవన్. కళాశాలలో ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలని కోరారు. సీనియర్ విద్యార్థుల ఆలోచన ధోరణి మారాలి. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడటం, ఆధిపత్య ధోరణి చూపడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలని కోరారు పవన్ కళ్యాణ్.