తెలంగాణలో 30 సీట్లలో పోటీ చేస్తాం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ప్రజలకు దగ్గరయ్యేందుకు పాదయాత్ర చేపడుతా : పవన్ కళ్యాణ్

Update: 2022-05-21 01:21 GMT

తెలంగాణలో 30 సీట్లలో పోటీ చేస్తాం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తామన్న సవాల్‌ను స్వీకరిస్తున్నానన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. పవన్ కల్యాణ్ శుక్రవారం రాత్రి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పు పుట్టని స్థాయికి చేర్చిందన్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలన్నదానిపై తమకు స్పష్టత ఉందన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉమ్మడి కార్యాచరణ ఉండాలన్నారు. జనసేన, బీజేపీ కలిసే జనాల్లోకి వెళ్తామన్నారు. ముందస్తు ఎన్నికల అంశాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రస్తుతం బీజేపీతోనే కలిసి నడుస్తామని... ప్రజలకు దగ్గరయ్యేందుకు పాదయాత్ర చేపడుతానన్నారు పవన్ కల్యాణ్. విదేశీ సంస్థలు పెట్టుబడికి స్టెబిలిటి చేస్తాయన్నారు పవన్ కల్యాణ్. స్థిరత్వం లేనప్పుడు ఎన్ని పర్యటనలు చేసినా ప్రయోజనం ఉండదన్నారు. కాగితాల మీద సంతకాలు పెడితే పరిశ్రమలు పెట్టినట్లు కాదన్నారు.

లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించే తెలివి తేటలున్న వారు జనాలకు మేలు చేసే అంశాలపై శ్రద్ధ పెట్టరా అని ప్రశ్నించారు. తెలంగాణలో 30 సీట్లలో పోటీ చేస్తామని... కనీసం 15 సీట్లలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు పవన్ కల్యాణ్. పవన్ మాట్లాడుతున్న సమయంలో మధ్య కరెంట్ పోయింది. దాంతో పవన్ సెల్ ఫోన్ వెలుగులో మాట్లాడారు. సమావేశం సమాచారం రావడంతోనే కరెంట్ తీయించారంటూ పవన్ ఛలోక్తులు విసిరారు. అయితే ఈ చీకటి ప్రెస్ మీట్ ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

Tags:    

Similar News