Haritha Haram: నేటి నుంచి పల్లె, పట్టణ పగ్రతి, హరితహారం కార్యక్రమాలు
Haritha Haram: సర్వం సిద్ధం చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.04కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం
పల్లె ప్రగతి (ఫైల్ ఫోటో)
Haritha Haram: ఆదిలాబాద్‌లో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు కృషి చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సక్సెస్ చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విషయంలో అధికారులకు, నాయకులకు పలు సూచనలు, సలహాలు చేశారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా మురుగు కాల్వలను శుభ్రం చేయడం, తాగునీటి పైపులైన్లు, నల్లాల లీకేజీలు లేకుండా మరమ్మతులు చేపట్టలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి 2.01 కోట్ల మొక్కలు నాటాలని మంత్రి ఆదేశించారు.