పాలమూరు ఆర్మీ జవాన్‌ పరశురాం అంత్యక్రియలు ఈరోజు..!

* ఆర్మీ జవాన్‌ పరశురాం కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం * రూ. 25 లక్షల సాయం అందజేస్తామని హామీ * మహబూబ్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయింపు

Update: 2020-12-27 06:49 GMT

దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పాలమూరు ఆర్మీ జవాన్‌ పరశురాం అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి. అమర జవాన్ పరుశురాంని చివరి చూపు చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. పరుశురాం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. 25 లక్షల రూపాయలు సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది. మహబూబ్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయిస్తామని భరోసా కల్పించింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం గువ్వనికుంట తండాకు చెందిన పరశురాం సైన్యంలో హవల్దార్‌ హోదాలో పనిచేస్తున్నాడు. అయితే, గురువారం జమ్ము కశ్మీర్‌ లఢక్‌లోని లేహ్‌లో కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆర్మీజవాన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొంటుందని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ధైర్యం చెప్పారు. పరశురాం పార్థివదేహాన్ని శనివారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకురాగా.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ జీ రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. సైనిక సంక్షేమ నిధినుంచి కూడా నిధులు విడుదలయ్యేలా కృషిచేస్తామని శ్రీనివాస్‌గౌడ్‌ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News