పాకిస్థాన్‌లో అన్నదాతలకు ఇబ్బంది కలిగిస్తున్న మిడతలు

మిడతల సమస్యపై పోరుకు పాకిస్థాన్‌ ప్రభుత్వం జాతీయ ఆత్యయిక పరిస్థితిని ప్రకటించింది.

Update: 2020-02-02 10:29 GMT

మిడతల సమస్యపై పోరుకు పాకిస్థాన్‌ ప్రభుత్వం జాతీయ ఆత్యయిక పరిస్థితిని ప్రకటించింది. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమస్య నుంచి అన్నదాతలను బయట పడేయడానికి ఉద్దేశించిన జాతీయ సత్వర ప్రణాళికకు రూ.730 కోట్లు కేటాయించారు. దేశంలోనే ప్రధాన వ్యవసాయ ప్రాంతమైన సింధ్‌ ప్రావిన్స్‌లోని వ్యవసాయ క్షేత్రాలపై గత కొన్ని దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంతగా ఈ కీటకాలు దాడిచేస్తున్నాయి. దీంతో పంటలు సర్వనాశనం అవుతున్నాయి.

Tags:    

Similar News