Telangana: తెలంగాణలో రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు

Telangana: రా రైస్ కొనుగోలుపై కేంద్రం నుంచి రాని స్పష్టత

Update: 2022-04-14 03:00 GMT

Telangana: తెలంగాణలో రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు 

Telangana: తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ర్టప్రభుత్వం ప్రకటించినా కేంద్రం ఎంత తీసుకుంటుందనే విషయంలో స్పష్టత రావడం లేదు. రా రైస్ కొనుగోలుపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. రేపటి నుంచి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరగనున్నాయి. మే చివరివారం లేదా జూన్ మొదటి వారంలో కొనుగోళ్లు పూర్తి చేయనున్నారు. వ్యవసాయ శాఖ ఇప్పటికే రైతుల పంటపై డేటా సేకరించింది. రైతు ధాన్యం అమ్మడానికి వెళ్లిన సమయంలో డ్యాష్ బోర్డులో రైతుల డేటా కనిపిస్తుంది. రైతు మొబైల్‌కు ఓటీపీ వచ్చాక రైతుల ధాన్యం కొనుగోలు చేస్తారు. ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద నోడల్ అధికారి అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రంలో 34 లక్షల ఎకరాల్లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ధాన్యం సేకరణ కోసం 15కోట్ల గన్నీ బ్యాగులు అవసరం అవుతాయి. రాష్ట్రంలో కోటి 60లక్షల గన్నీ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 7 కోట్ల 50లక్షల కొత్త గన్నీ బ్యాగులు కావాల్సి ఉంది. వాటి కోసం 520 కోట్లు అడ్వాన్సు చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రం దాటి బ్యాగులు బయటికి వెళ్లద్దని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. 1960 రూపాయలకు కంటే ఒక్క రూపాయి తక్కువకు ఎవరూ అమ్ముకోవద్దన్నారు.

పారా బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్‌పై కూడా కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రచ్చ సాగుతోంది. రా రైస్ ఎంత ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి గతంలోనే క్లారిటీ ఇవ్వలేదు. అయితే రా రైస్ ఎంత ఇచ్చినా కొనుగోలు చేయాలని తెలంగాణ సర్కార్ కేంద్రానికి లేఖ రాయనుంది. రా రైస్ కేంద్రం కొనుగోలు చేయకపోతే ఏం చేయాలనే ఆలోచనలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. 

Tags:    

Similar News