గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Update: 2020-05-22 06:27 GMT

గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసనకు దిగారు. ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన ఇన్సూరెన్స్ తమకు వర్తింపచేయలని ఆందోళనకు దిగారు. కరోన డెడ్ బాడీలను ప్యాకింగ్ చేసే ఉద్యోగికి కరోన పొజిటీవ్ నిర్ధారణ అయ్యింది. ఆయన వెంటిలేటర్ పై ఉండడంతో ఆందోళన చెందుతున్న కాంటాక్ట్ ఉద్యోగుల న్యాయపోరాటానికి దిగారు.

కరోన చికిత్సలో గాంధీ వైద్యులతో పాటు తాము సేవలు చేస్తున్నప్పుడు మాకు ఎమన్నా అయితే ఎవరు దిక్కుని వాపోయారు. గాంధీ సుపెరడెంట్ ను కలిసి విజ్ఞప్తి చేసిన కాంటాక్ట్ ఉద్యోగులు, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన అన్ని వసతులు మాకు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే ముఖ్యమంత్రి , ఆరోగ్యశాఖ మంత్రి స్పందించలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News