లోన్‌ తీసుకోకున్నా వేధింపులు.. కూతురు, భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి..

Khammam: లోన్ తీసుకోకుండానే తీసుకున్నావు అంటూ సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

Update: 2022-09-25 07:16 GMT

లోన్‌ తీసుకోకున్నా వేధింపులు.. కూతురు, భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి..

Khammam: లోన్ తీసుకోకుండానే తీసుకున్నావు అంటూ సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కారాయిగూడెం గ్రామానికి చెందిన చింతనిప్పు వెంకటేశ్వరరావుకు గత నెల ఆగష్టు 20న వాట్సాప్ కాల్ చేసిన రుణయాప్ నిర్వాహకులు తీసుకున్న 1400 రుణం చెల్లించాలని బెదిరించారు. కానీ తాను ఎలాంటి రుణం తీసుకోలేదని ‎చెప్పి ఫోన్ కట్ చేశాడు.. కానీ రుణయాప్ ల నిర్వాహకులు వాట్సాప్ కాల్ చేసి 1400 చెల్లించకపోతే వాట్సాప్ డీపీ లో ఉన్న కూతురు, భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి అందరికీ పంపిస్తామంటూ వేధించారు.

ఈ వేధింపులు తట్టుకోలేక ఫోన్ పే ద్వారా 1400 చెల్లించాడు. మరోసారి కూడా వాట్సాప్ కాల్ చేసి డబ్బులు రాలేదని, ఫొటోస్ అందరికీ షేర్ చేస్తామంటూ వేధిస్తుండటంతో వారు పంపిన లింక్ పై క్లిక్ చేసి రెండుసార్లు 1400 చొప్పున చెల్లించి ఫోన్ ఆఫ్ చేశాడు వెంకటేశ్వరరావు కొద్దిరోజుల తరువాత సైబర్ నేరగాళ్లు మళ్లీ వేధించడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడా బాధితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News