హైదరాబాద్‌లో తగ్గుముఖం పడుతున్న ఉల్లి ధరలు

ఒకానొక దశలో రెండు వందలకి చేరిన ఉల్లి ధరలు ప్రస్తుతం 50 రూపాయలకి దొరుకున్నాయి.. తగ్గిన ఉల్లి ధరలపై hmtv స్పెషల్ స్టొరీ..

Update: 2019-12-14 16:49 GMT
Onion prices

హైదరాబాద్ నగరంలో నిన్నటి వరకు కొండెక్కిన ఉల్లి ధరలు మెల్లిగా దిగి వస్తున్నాయి. ఒకానొక దశలో రెండు వందలకి చేరిన ఉల్లి ధరలు ప్రస్తుతం 50 రూపాయలకి దొరుకున్నాయి.. తగ్గిన ఉల్లి ధరలపై hmtv స్పెషల్ స్టొరీ..

ఉల్లి గడ్డలు కోసేటప్పుడే కాదు.. కొనేటప్పుడు కూడా సామాన్యుల కంట తడి పెట్టించాయి. పెరిగిన ఉల్లి ధరల కారణంగా సామాన్య ప్రజలు వంటల్లో ఉల్లి వాడకం తగ్గించారు. కొన్ని వారాల పాటు ఉల్లికి దూరంగా ఉన్నారు. పొదుపుగా ఉల్లిని వాడుకుంటూ వస్తున్నారు. అటువంటి ఉల్లి రేటు ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. మార్కెట్లలో మొన్నటి వరకు కిలో ఉల్లి 200 రూపాయలకు అమ్మిన వ్యాపారులు .. ఇప్పుడు కొత్త పంటలు వస్తుండడంతో తక్కువ ధరలకే ఉల్లిని విక్రయిస్తున్నారు. మూడు రకాల ఉల్లి వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. మహరాష్ట్ర పాత ఉల్లి 120 కిలో పలికితే ఇక రెండవ రకం ఉల్లి 70-90 పలుకుతుంది. సైజు చిన్నగా ఉన్న ఉల్లి ఐతే 50 రూపాయలకు అమ్ముతున్నారు.

ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతుండడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రానున్న రోజుల్లో తగ్గుతూ వస్తాయని ఉల్లి మార్కెట్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. హోల్‌ సేల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి 50 రూపాయలు అమ్ముతున్నామని చెబుతున్నారు. కర్నూల్, మహారాష్ట్రలో ఉల్లి పంట పండే సమయం కాబట్టి ధరలు తగ్గుతున్నాయని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఉల్లి ధరలు మరింత దిగి వస్తాయని మార్కెట్ వ్యాపారులు చెప్తున్నారు.

ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నప్పటికీ రిటైల్ మార్కెట్‌లో మాత్రం కిలో 80 నుంచి 90 రూపాయల వరకూ అమ్ముతున్నారు వ్యాపారాలు.. అలాగే సైజు, క్వాలిటీని బట్టి కూడా ధరలకు ఫిక్స్ చేస్తామని అంటున్నారు. ఉల్లి ధరలు పెరగాయని ఉల్లి దోశలు, ఆమ్లెట్లు తినకుండా ఉన్న వారికి ఇక ఆ కష్టాలు తీరనున్నాయి. సామాన్యులందరికీ ఉల్లి ధరలు అందుబాటులో రావడంతో.. ఉల్లి ప్రధానం ఉంటే వంటలను కడుపారా ఆరగించనున్నారు. 

Tags:    

Similar News