హైదరాబాద్ నగరంలో రేపు ఏం జరగబోతోంది?

ఇప్పటికే 13 రోజులుగా ఆర్టీసీ సమ్మె చేస్తోంది. సర్కార్ ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశామంటూ చెప్పుకుపోతోంది. కానీ రోజూ నగరంలో తిరిగే పౌరులకు మాత్రం నరకం కనిపిస్తోంది. సర్కార్ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు ఎక్కడా కనపడవు.

Update: 2019-10-18 14:02 GMT

హైదరాబాద్ నగరంలో రేపు ఏం జరగబోతోంది? ఇప్పటికే 13 రోజులుగా ఆర్టీసీ సమ్మె చేస్తోంది. సర్కార్ ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశామంటూ చెప్పుకుపోతోంది. కానీ రోజూ నగరంలో తిరిగే పౌరులకు మాత్రం నరకం కనిపిస్తోంది. సర్కార్ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు ఎక్కడా కనపడవు. ఒకవేళ ఉన్నా.. రెట్టింపు చార్జీలు.. దీనికి తోడు అనుభవం లేని డ్రైవర్ల దూకుడు డ్రైవింగ్.. ఇలా నగర ప్రజల రవాణా కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు రవాణా సర్వీసులైన ఓలా, ఊబర్ కూడా నిన్న మొన్నటి వరకూ కాస్త ప్రజలను ఆదుకున్నాయి. ఇప్పుడు సందట్లో సడేమియాలా ఆ సర్వీసులు కూడా రేపు సమ్మెకు వెడుతున్నాయి.

కిలోమీటర్ కు మినిమం 22 రూపాయలు చేయాలంటూ ఈ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. రేపు ప్రైవేట్ క్యాబ్ సర్వీస్ ఉండదు. ఆర్టీసీ ఆల్రెడీ సమ్మెలోనే ఉంది. సో.. ఇక నగర పౌరులకు చుక్కలు కనిపించడం ఖాయం అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ మెట్రో రైళ్ల సేవలు నాల్గింతలు పెంచడం వల్ల మాత్రమే నగర పౌరులు రవాణా కష్టాల నుంచి ఉపశమనం పొందారు. తాజా పరిణామాలతో మెట్రో సర్వీసులు మరింత పెంచుతుందా..? అక్టోబర్ 19న నగరంలో ఏం జరగబోతోంది..? ప్రస్తుతం నగర పౌరులందరి మదిలో రేగుతున్న ప్రశ్న ఇదే.

Tags:    

Similar News