తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షం.. ఐదు జిల్లాలకు కొనసాగుతున్న రెడ్ అలర్ట్‌

Weather Report: ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద.. 2 రోజులుగా ముసురేయడంతో స్తంభించిన జనజీవనం

Update: 2023-07-19 09:46 GMT

తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షం.. ఐదు జిల్లాలకు కొనసాగుతున్న రెడ్ అలర్ట్‌

Weather Report: తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ కొనసాగుతోంది. జనగాం,వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్,ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆయా జిల్లాల్లో ఇవాళ ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇక కొత్తగూడెం, ములుగు, సిద్ధిపేట, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. రేపు కూడా రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగే ఉండనున్నాయి.

రేపు రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో.. వాగులు పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లు ధ్వంసమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు మూడు రోజులుగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులకు వర్షం అంతరాయం కలుగుతోంది.గనుల్లోకి వరద నీరు చేరుతుండటంతో బొగ్గు సరఫరా నిలచిపోయింది.

Tags:    

Similar News