మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత లేదు – వ్యవసాయ శాఖ అధికారిణి విజయ నిర్మల
రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం- విజయ నిర్మల
మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత లేదు – వ్యవసాయ శాఖ అధికారిణి విజయ నిర్మల
యూరియా అధిక ధరలకు విక్రయిస్తే షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయ నిర్మల హెచ్చరించారు. జిల్లాలో 4 లక్షల 20 వేల ఎకరాలలో వివిధ పంటలు సాగవుతున్నాయన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో 27 వేల 350 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణి చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ ఆదేశాలతో
పకడ్బందీగా చర్యలు చేపట్టి యూరియా కొరతను అధిగమించామన్నారు.