MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట
MLC Kavitha: మధ్యంతర బెయిల్ నిరాకరించిన రౌస్ అవెన్యూ కోర్టు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. లిక్కర్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత తన కుమాడి పరీక్షల నేపథ్యంలో.. మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీ, కవిత తరపు న్యాయవాదులు వాడీవేడిగా వాదనలు వినిపించారు.
వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇక ఈనెల 20న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. మరోవైపు రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుండటంతో మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు.