Talasani Srinivas: సినిమా థియేటర్ల మూసివేత అవాస్తవం
Talasani Srinivas: సినిమా థియేటర్లు మూసివేత వార్తలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు.
తలసాని ఇమేజ్ సోర్స్ (Wiki)
Talasani Srinivas: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ పడగవిప్పుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు సినిమా థియేటర్లు కూడా మూసివేయాలనే ప్రతిపాదనలు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి పంపించింది. తెలంగాణలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయి దాటిపోయే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లు మూసివేస్తారని వస్తున్న వార్తలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. థియేటర్లను మూసివేసే ప్రసక్తే లేదన్నారు. సినిమా హాళ్లు యథావిధిగా నడుస్తాయని.. కొవిడ్ నిబంధనలతో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.