Revanth Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలది ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. నేను టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నంతకాలం..

Revanth Reddy: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు.

Update: 2023-04-04 12:01 GMT

Revanth Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలది ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. 

Revanth Reddy: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. తాను టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నంతకాలం.. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని గతంలోనే రాహుల్‌ గాంధీ చాలా క్లియర్‌గా చెప్పారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 80 స్థానాల్లో గెలుస్తుందని ఆశిస్తున్నానన్నారు రేవంత్‌రెడ్డి. ఇక బీఆర్‌ఎస్‌ 20 కంటే తక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, బీజేపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యే ఛాన్స్‌ ఉందని జోస్యం చెప్పారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీల మధ్య ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ నడుస్తోందని, ఎన్నికల సమయంలో మూడు పార్టీలు ప్రచారం చేస్తున్నా.. ఎన్నికల్లో మాత్రం ఇద్దరే అవుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో విపక్ష పార్టీల సమావేశాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ హాజరయినంత మాత్రాన ఆ పార్టీతో కాంగ్రెస్‌ కలవదని చెప్పారు. ఇక షర్మిల పార్టీ ఒక ఎన్జీవో ఆర్గనైజేషన్‌ మాత్రమేనని, బీజేపీతో మాట్లాడే షర్మిలతో కాంగ్రెస్‌ కలిసేది లేదన్నారు. తెలంగాణలో రద్దు చేయాల్సింది పరీక్షలను కాదని, ప్రభుత్వాన్ని అని చురకలు అంటించారు రేవంత్‌రెడ్డి.

Tags:    

Similar News