కేంద్ర మంత్రి మాండవీయకు రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ

* రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలి * అక్టోబర్, నవంబర్‌లో 3.67 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించిన కేంద్రం

Update: 2021-11-09 06:05 GMT

కేంద్ర మంత్రి మాండవీయకు రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ(ఫైల్ ఫోటో)

Niranjan Reddy: అవసరాలకు అనుగుణంగా తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేఖ రాశారు.

అక్టోబరు, నవంబరు నెలలకు 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను కేవలం 3.67 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం కేటాయించింది. అయితే ఇప్పటివరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే సరఫరా చేసింది. అయితే కేటాయింపుల ప్రకారం 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందని, వెంటనే సరఫరా చేయాలని కేంద్ర మంత్రికి లేఖ రాశారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Tags:    

Similar News