Weather Report: వడగాల్పుల హెచ్చరిక.. 5 రోజుల పాటు పెరగనున్న ఎండలు
Weather Report: వేడిని తట్టుకోలేక ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు
Weather Report: వడగాల్పుల హెచ్చరిక.. 5 రోజుల పాటు పెరగనున్న ఎండలు
Weather Report: తెలంగాణలో రాష్ట్రంలో ఎండ దంచికొడుతోంది. రాబోయే ఐదు రోజుల పాటు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని, వడగాడ్పుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ 15 జిల్లాలకు ఎండలపై ఆరెంజ్అలర్ట్జారీ చేసింది. రాత్రిపూట కూడా టెంపరేచర్లు పెరుగుతాయని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వడగాడ్పులు ఎక్కువగా వీచే ముప్పు ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్జిల్లాలకు ఆరెంజ్అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో టెంపరేచర్లు 3 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరించింది.