Telangana: తెలంగాణ ఎక్సైజ్ శాఖకు న్యూ ఇయర్ లిక్కర్ కిక్
Telangana: నిన్న ఒక్కరోజే రూ.215.74 కోట్ల ఆదాయం
Telangana: తెలంగాణ ఎక్సైజ్ శాఖకు న్యూ ఇయర్ లిక్కర్ కిక్
Telangana: తెలంగాణ ఎక్సైజ్ శాఖకు న్యూ ఇయర్ లిక్కర్ కిక్ ఎక్కింది. నిన్న ఒక్కరోజే 215.74 కోట్ల ఆదాయం సమకూరింది. అమ్మకాలు తగ్గినా మద్యం ధరలు పెరిగిన కారణంగా భారీగా ఆదాయం సమకూరింది. 19 డిపోల పరిధిలో జోరుగా రిటైల్ అమ్మకాలు జరిగాయి. సుమారు 2 లక్షల 17 వేల 444 కేసుల లిక్కర్ బాటిళ్లు.. సుమారు 1 లక్షా 28వేల 455 బీర్ కేసుల అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్ పరిధిలోని రెండు డిపోల్లోనే ఏకంగా 37.68 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ 1 డిపో పరిధిలో 15 వేల 251 లిక్కర్ కేసులు అమ్ముడవగా.. 4వేల 141 కేసుల బీర్ కేసులు సేల్ అయ్యాయి. డిపో 1లో 16కోట్ల 90 లక్షలు ఆదాయం వచ్చింది. హైదరాబాద్ 2 డిపో పరిధిలో 18 వేల 907 లిక్కర్ కేసులు .. 7వేల 833 బీర్ కేసులు అమ్ముడయ్యాయి. వాటి ద్వారా 20 కోట్ల 78 లక్షల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.