ORR: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్.. రూల్స్ మారాయ్.. వాహనదారులూ ఓ లుక్కేయండి..

ORR: 40 కి.మీ లోపు స్పీడ్‌ వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరణ

Update: 2023-07-31 10:32 GMT

ORR: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్.. రూల్స్ మారాయ్.. వాహనదారులూ ఓ లుక్కేయండి..

ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఔటర్‌పై కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి సైబరాబాద్ పోలీసులు నోటిఫికేషన్ జారీ చేశారు. లైన్-1, 2లో.. 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్‌ను పోలీసులు అనుమతించారు. అలాగే లైన్- 3, 4 లో 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడు లిమిట్‌‌కు మాత్రమే అనుమతి ఉండనుంది. ఐదవ లైన్‌లో 40 కిలోమీటర్ల స్పీడ్‌కు అనుమతి ఇచ్చారు పోలీసులు. 40 కిలోమీటర్ల స్పీడ్‌కు తక్కువ వెళ్లే వాహనాలకు అనుమతి లేదని.. అలాగే టూ వీలర్స్‌కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పాదచారులకు కూడా అనుమతి లేదని సైబరాబాద్‌ పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News