By-Elections: నేటి నుంచి నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్లు
By-Elections: ఈనెల 31న నామినేషన్‌ల పరిశీలన * ఏప్రిల్ 3న ఉపసంహరణకు తుదిగడువు
Representational Image
By-Elections: నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ జారీ కానుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ నెల 30 వరకు నామినేషన్‌లను స్వీకరిస్తారు. 31న నామినేషన్‌ల పరిశీలన, ఏప్రిల్ 3న ఉపసంహరణకు తుదిగడువు ముగియనుంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నాగార్జునసాగర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ఈ నెల 16న షెడ్యూల్ ప్రకటించింది. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ మినహా, మిగిత పార్టీలేవి అభ్యర్థులను ప్రకటించ లేదు. పోలింగ్‌కు 25 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థుల ఖరారు, ప్రచార వ్యూహంపై పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.