Ramchander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు
Ramchander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిది అనే ఉత్కంఠకు చివరికి తెరపడింది.
Ramchander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు
Ramchander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిది అనే ఉత్కంఠకు చివరికి తెరపడింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు ఖరారైనట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం ఆయనను నామినేషన్ దాఖలు చేయాలని ఆదేశించగా, రామచందర్ రావు మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేయనున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రకటించడం లాంఛనమేనన్న ప్రచారం జరిగింది. అయితే రమచందర్‌రావు వైపే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గుచూపింది.