Munugode By Poll: రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మునుగోడు ఎన్నికలు

Munugode By Poll: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు

Update: 2022-10-07 01:22 GMT

Munugode By Poll: రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మునుగోడు ఎన్నికలు

Munugode By Poll: మునుగోడు లో గులాబి పార్టీ దూకుడు పెంచింది. బి అర్ ఎస్ గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ సమయం తీసుకోనుండటంతో టీఆరెఎస్ పేరు మీదనే బై పోల్ బరిలో దిగనుంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ ను అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు.

మునుగోడు ఉప ఎన్నికల విషయంలో అధికార పార్టీ దూకుడు పెంచింది. ఈ ఎన్నికలు కేసిఆర్‌కు కీలకంగా మారాయి. నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్రసమితిగా ఉన్న పార్టీ జాతీయ ప్రస్థానంలో భారత్‌ రాష్ట్రీయ సమితిగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలనుంచే BRS పార్టీ తరఫును బరిలోకి దిగాలనే ప్రయత్నం చేశారు. ఎన్ని్కల సంఘం వద్ద నిన్న అఫిడవిట్ దాఖలు చేయడంతో పార్టీ నోటిఫై కావడంలో ఆలస్యమయ్యే అవకాశాలు కన్నిస్తున్నాయి. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో అభ్యర్థి ఖరారు చేసేందుకు ఆచీతూచి అడుగేస్తున్నారు. కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే మునుగోడులో సభ నిర్వహించినప్పటికీ అభ్యర్థి ఖరారు విషయంలో జాగ్రత్త వహించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం బి అర్ ఎస్ ను గుర్తించడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో టీఆరెఎస్ గుర్తు తోనే పోటీ చేయనుంది. గడిచిన హుజూరాబాద్ ,దుబ్బాక ఎన్నకల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని కేసిఆర్ పార్టీ యంత్రాంగాన్ని మునుగోడులో ఉండలాని ఆదేశించారు. ఇప్పటికే ప్రతి మండలానికి ఇద్దరు మంత్రులు గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యే లకు ప్రచారం కోసం బాధ్యతలు అప్పగించారు. మంత్రులు హరీష్ రావు, కెటిఆర్ లకు పూర్తి స్థాయి ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఒకటి రెండు రోజుల్లో మంత్రి హరీష్ రావు మునుగోడు లో పర్యటించే అవకాశం ఉంది. ఆగస్టు 20న మునుగోడు లో భారీ బహిరంగ సభ నిర్వహించిన గులాబీ దళపతి మరోసారి పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేయాలనీ భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు , నల్లగొండ జిల్లా నేతల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకొని నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

నిన్నటి వరకు మునుగోడు లో బి అర్ ఎస్ తరుపున పోటీ ఉంటుందా లేక టీఆర్ఎస్ తరుపున ఉంటుందా అన్న గందరగోళంలో ఉన్న గులాబి క్యాడర్ కు స్పష్టత రావడంతో త్వరలో సీఎం కేసిఆర్ తో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనీ భావిస్తున్నారు. ఆ సభ ద్వారా మునుగోడు గెలుపుపై జరగబోయే పరణమాలను కేసిఆర్ వివరించనున్నారు.గతంలో బీజేపీ నీ మోదీని పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన కేసిఆర్ పార్టీ పేరు మార్పు తరువాత పెట్ట బోతున్న సభ కావడంతో అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల పలితాలు టీఆర్ఎస్ అంత ఈజీ గా తీసుకొనే పరిస్థితి లేదు. అటు హస్తీన పెద్దలు సైతం డిల్లీ నుండి ఫోకస్ చేస్తున్నారు. మునుగోడు లో ఈటెల రాజేందర్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. కేసిఆర్ మీద , టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేక వర్గాలను బీజేపీ వైపు తిప్పుకోనే పనిలో పడ్డారు. హుజరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు తనపై చేసిన దాడిని మునుగోడు కేంద్రంగా ఎదురుకోవాలని యోచిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలు అణువణువు తెలిసిన ఈటెల దూకుడు కు చెక్ పెట్టడానికి హరీష్ రావు,కేటీఆర్ కు స్పెషల్ ఆపరేషన్ బాధ్యతలు అప్పగించారు కెసిఅర్. ఉద్యమ కారులను , నిరుద్యోగులను , ఇతర వర్గాలను హరీష్ రావు మాత్రమే కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారన్న ఉద్దేశ్యం తో కేసిఆర్ తనకు ఈ టాస్క్ అప్పజెప్పారు.

Tags:    

Similar News