సీఎం కేసిఆర్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మృత్యుంజయహోమం
Satyavathi Rathod: మంత్రుల నివాసగృహంలో మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక యాగపూజలు
సీఎం కేసిఆర్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మృత్యుంజయహోమం
Satyavathi Rathod: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయహోమం నిర్వహించారు. మంత్రుల నివాసగృహ సముదాయంలోని సత్యవతి రాథోడ్ తన గృహంలో వేదపండితులు, రుత్వికులచే మృత్యుంజయ యాగం నిర్వహించారు. ఈ యాగ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బిందు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.