పార్లమెంటరీ పక్షనేతను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌

Update: 2019-06-13 11:11 GMT

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీకి ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటు పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపీ కేశవరావు ఎన్నికయ్యారు. లోక్‌సభాపక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును, రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్ష నాయకుడిగా కేకే ఎన్నికయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి సభ్యులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. లోక్‌సభ, రాజ్యసభలలో ఒక్కో డిప్యూటీ లీడర్.. ఒక్కో విప్‌ను నియమించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News