MP Laxman: తెలంగాణ అభివృద్ధికి మోడీ కృష్టి.. బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు

MP Laxman: కేంద్రం ఇచ్చి రైల్వే ప్రాజెక్టులపై కేటీఆర్ మాట్లాడాలి

Update: 2023-08-17 08:26 GMT

MP Laxman: తెలంగాణ అభివృద్ధికి మోడీ కృష్టి.. బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు

MP Laxman: తెలంగాణ అభివృద్ధి‌కి ప్రధాని నరేంద్ర మోడీప్రత్యేక చొరవ చూపుతున్నారని బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. . దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మోడీ అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. ట్విటర్ టిల్లు కేటీఆర్ కేంద్రం ఆమోదించిన రైల్వే ప్రాజెక్టుల గురించి మాట్లాడాలన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లు బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ , కేటీఆర్ లకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కేంద్రం ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులపై తండ్రి కొడుకులు తమ స్పందన ఏమిటో చెప్పాలన్నారు. ఢిల్లీలో లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు.

Tags:    

Similar News