MLC Kavita: కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ .. పీవీ సేవలను మరిచింది
MLC Kavita: పీవీ నర్సింహరావు మేధో సంపత్తి ఉన్న వ్యక్తి
MLC Kavita: కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ .. పీవీ సేవలను మరిచింది
MLC Kavita: నిజామాబాద్ బోర్గాం కమాన్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాన్ని ఎమ్మెల్సీలు వాణి దేవి, కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు మేధో సంపత్తి ఉన్న వ్యక్తి అన్నారు ఎమ్మెల్సీ కవిత. విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చిన ఘనత పీవీదేనని కవిత కొనియాడారు. నవోదయ కాన్సెప్ట్ కూడా పీవీ నర్సింహరావుదేనని తెలిపారు. కాంగ్రెస్ గడ్డు రోజులు ఎదుర్కొంటున్న కాలంలో పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. మన్మోహన్, పీవీ కాంబినేషన్ వల్లే భారత్ గట్టెక్కిందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.