గద్వాల జిల్లా పర్యటనకు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత
* శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న కవిత
MLC Kavitha (photo the Hans india)
గద్వాల జిల్లా పర్యటనకు బయల్దేరారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆమె పాల్గొననున్నారు. వెళ్తూ వెళ్తూ వనపర్తిలోని కొత్తకోటలో పట్టణ ప్రకృతివనాన్ని కవిత సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కవితకు ఘనస్వాగతం పలికారు స్థానిక టీఆర్‌ఎస్ నేతలు, తెలంగాణ జాగృతి నాయకులు.