MLC Kavitha: సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి
MLC Kavitha: సింగరేణి పాఠశాలల కాంట్రాక్ట్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సమావేశంలో కవిత
MLC Kavitha: సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి
MLC Kavitha: సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఢంకా మోగించాలని, అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు.. ఎమ్మెల్సీ కవిత నివాసంలో జరిగిన సింగరేణి కాంట్రాక్ట్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమావేశంలో ఆమె మట్లాడారు.
సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత కేసీఆర్‌దేనని, ప్రైవేటీకరణ నుంచి తప్పించి సింగరేణిని కేసీఆర్ కాపాడారని కొనియాడారు. ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలను.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత... సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని చెప్పుకొచ్చారు.... తెలంగాణ రాకముందు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదని, అప్పట్లో కేవలం 4 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తే... తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించామన్నారామె.