MLC Kavitha: గులాబీ రంగు అంబాసిడర్ కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: గణేష్ గుప్తా ఇంటి నుండి రిటర్నింగ్ అధికారి ఆఫీసు వరకు.. స్వయంగా కారు డ్రైవ్ చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన కవిత
MLC Kavitha: గులాబీ రంగు అంబాసిడర్ కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఎన్నికల వేళ ఎమ్మెల్సీ కవిత కారు నడపడం ఆసక్తిగా మారింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున గణేష్ గుప్తా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా గణేష్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారు నడిపి అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
గులాబీ రంగులో ఉన్న అంబాసిడర్ కారును గణేష్ గుప్తా ఇంటి నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు ఆమె డ్రైవింగ్ చేశారు. మహిళలు డ్రైవింగ్ చేయటం సాధారణ విషయమే...కానీ, ఎమ్మెల్సీగా ఉన్న ఓ మహిళ కారు నడపడం, అందులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పని చేయడం అందరినీ ఆకర్షించింది.