MLC Kavitha: మాపై ఈడీ, సీబీఐ కేసులు.. నీచమైన రాజకీయ ఎత్తుగడ

MLC Kavitha: కేసులు పెట్టినా.. అరెస్ట్‌ చేసినా.. జైల్లో పెట్టినా.. భయపడం

Update: 2022-12-01 05:10 GMT

MLC Kavitha: మాపై ఈడీ, సీబీఐ కేసులు.. నీచమైన రాజకీయ ఎత్తుగడ

MLC Kavitha: మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలవుతోందని.. 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు రానున్నాయన్నారు. అందుకే మోడీకి ముందే ఈడీ వచ్చిందన్నారు. ఎన్నికలు జరిగే ముందు ఈడీ రావడం కామన్ అన్నారామె. ఎజెన్సీలు వచ్చి ప్రశ్నిస్తే సమాధానాలు చెబుతానని అన్నారు కవిత. తమపై కేసులు పెట్టడం నీచమైన రాజకీయ ఎత్తుగడ అని ధ్వజమెత్తారు. మోడీ తన పంథాను మార్చుకోవాలని మోడీకి హిందీలో విన్నివించారు. తన మీద.. మంత్రులు.. ఎమ్మెల్యేల మీద ఈడీ కేసులు పెడుతోందన్నారు. కేసులు పెట్టుకోండి... అరెస్టులు చేయండి... జైల్లో వేయండి.. మేం భయపడమన్నారు. ఈడీని ప్రయోగించి ఎన్నికల్లో గెలవాలంటే కుదరదన్నారామె. రాష్ట్రాల్లో బీజేపీ చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తోందని ఆరోపించారు.

Tags:    

Similar News