MLC Kavitha: కేంద్రం దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షలకు వాడుతోంది
MLC Kavitha: కేంద్రం దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షలకు వాడుతోంది
MLC Kavitha: కేంద్రం దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షలకు వాడుతోంది
MLC Kavitha: మీడియాకు నాలుగు పేజీలతో కూడిన లేఖను ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. జడ్జికి చెప్పాలనుకున్న అంశాలను 4 పేపర్లపై ఆమె రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు లేఖ విడుదల చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఈ కేసులో తన ప్రమేయం లేదన్నారు. ఈ కేసులో ప్రచారం జరిగినట్టు తాను ఎలాంటి లబ్ధి పొందలేదన్నారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా దెబ్బ తీసేందుకు తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
సీబీఐతో పాటు ఈడీ విచారణకు కూడా సహకరించానని తెలిపారు. నిందితుల వాంగ్మూలాలతో మాత్రమే కేసు నమోదు చేశారని..ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ తనను అరెస్ట్ చేసిందన్నారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షలకు వాడుకుంటోందని ఆరోపించారు. బీజేపీ నేతలు పార్లమెంట్ సాక్షిగానే విపక్ష నేతల్ని బెదిరిస్తున్నారని లేఖలో కవిత ప్రస్తావించారు.