MLC Kadiyam: ఎన్నికల్లో సొంత డబ్బులు పెట్టుకుని ఎమ్మెల్యే కోసం పని చేశా
MLC Kadiyam: నేను కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా
MLC Kadiyam: ఎన్నికల్లో సొంత డబ్బులు పెట్టుకుని ఎమ్మెల్యే కోసం పని చేశా
MLC Kadiyam: స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే రాజయ్యపై కడియం అసహనం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలను స్థానిక నాయకత్వం బేఖాతర్ చేస్తుందని.. ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. ఎన్నికల్లో సొంత డబ్బులు పెట్టుకుని ఎమ్మెల్యే కోసం పని చేశానని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో నిస్వార్ధంగా పని చేశానన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు, సభలు, సమావేశాలు ఉన్నప్పుడు సహాయం అడుగుతున్నారు కానీ.. ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ సమావేశాలకు పిలవడంలేదన్నారు. తాను కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.