Thatikonda Rajaiah: ఎన్‌కౌంటర్ల సృష్టికర్త కడియం శ్రీహరి.. పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి..

Thatikonda Rajaiah: జనగామ జిల్లా జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపణలపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు.

Update: 2023-07-08 01:48 GMT

Thatikonda Rajaiah: ఎన్‌కౌంటర్ల సృష్టికర్త కడియం శ్రీహరి.. పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి..

Thatikonda Rajaiah: జనగామ జిల్లా జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపణలపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. గ్లోబల్స్ ప్రచారం నమ్మవద్దని ఎమ్మెల్యే రాజయ్య సూచించారు. కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తనపై ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్ కౌంటర్ల సృష్టికర్త అని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కడియం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినన్ని ఎన్ కౌంటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా జరగలేదన్నారు.

Tags:    

Similar News