ములుగు జిల్లాలో ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్యటన

*వరద నీరు వచ్చి చేరిన జాతీయ రహదారిని పరిశీలించిన సీతక్క

Update: 2022-07-10 11:45 GMT

ములుగు జిల్లాలో ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్యటన

MLA Seethakka: ములుగు జిల్లాలో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే సీతక్క. వరద నీరు వచ్చి చేరిన జాతీయ రహదారిని ఆమె పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కరెంట్‌ తీగలు చెట్లకు తగిలి విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఎమ్మెల్యే సీతక్క. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కాంగ్రెస్‌ శ్రేణులు అందుబాటులో ఉండాలని, సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు సేవ చేయాలని సీతక్క గారు పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News