ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఈడీ విచారణపై ఉత్కంఠ
Rohith Reddy: ఈడీ విచారణకు మరికొంత సమయం కావాలన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఈడీ విచారణపై ఉత్కంఠ
Rohith Reddy: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ విచారణకు హాజరుకావాలని రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మరికాసేపట్లో ఈడీ అధికారుల ఎదుట ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ట్విస్ట్ నెలకొంది. ఈడీ విచారణకు మరికొంత సమయం కావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కోరుతున్నారు.
విచారణకు హాజరయ్యేందుకు తక్కువ సమయం ఇచ్చారంటున్న రోహిత్ రెడ్డి మరో వారం రోజుల పాటు గడువు కావాలని తన లాయర్ తో రోహిత్ రెడ్డి లేఖ పంపించారు. మరి రోహిత్ రెడ్డి విన్నపంపై ఈడీ స్పందనపై ఉత్కంఠ నెలకొంది.