MLA Rajaiah: కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే రాజయ్య
MLA Rajaiah: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ.. సందర్భంగా భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే రాజయ్య
MLA Rajaiah: కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే రాజయ్య
MLA Rajaiah: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. స్థానిక ఎమ్మెల్యే రాజయ్య భావోద్వేగానికి గురయ్యారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రాజయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాజయ్య వెంటే మేము ఉన్నాం.. అంటూ నినాదాలు చేశారు. రాజయ్య స్పందిస్తూ.. తనపై చూపుతున్న అభిమానానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని కంటతడి పెట్టారు. రాజయ్యకు ఇచ్చే మర్యాద ఇదేనంటూ శ్రీపతిపల్లికి నేత కేశిరెడ్డి మనోజ్‌రెడ్డి రాజయ్యకు పాదాభివందనం చేయగా.. మళ్లీ సభావేదికపై రాజయ్య కంటతడి పెట్టారు. కార్యకర్తలు సైతం భావోద్వేగానికి గురయ్యారు.