MLA Rajaiah: కులం పేరుతో కడియం అక్రమంగా రిజర్వేషన్ పొందారు

MLA Rajaiah: దళిత సంఘాలు ఉద్యమించి నిజాలు తేల్చాలి

Update: 2023-07-10 13:50 GMT

MLA Rajaiah: కులం పేరుతో కడియం అక్రమంగా రిజర్వేషన్ పొందారు

MLA Rajaiah: గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కడియం శ్రీహరిపై రాజయ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం తల్లి పద్మశాలి అని.. ఆయన మొదలు పద్మశాలీగానే పుట్టారని అన్నారు. కులం పేరుతో కడియం అక్రమంగా రిజర్వేషన్ పొందారని ఆరోపించారు.

ఈ విషయంపై దళిత సంఘాలు ఉద్యమించాలని... నిజాలు తేల్చాలన్నారు. కడియం శ్రీహరి తన కులాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఘన్ పూర్ నియోజకవర్గంలో మాదిగలను అణగదొక్కిన చరిత్ర కడియంది అని అన్నారు.

Tags:    

Similar News