MLA రాజాసింగ్‎పై పీడీయాక్ట్‌ కేసులపై వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైన రాజాసింగ్

పీడీయాక్ట్ ఎత్తివేయాలని అడ్వైజరీ కమిటీ ముందు వాదనలు వినిపించిన రాజాసింగ్ తరపు లాయర్

Update: 2022-09-29 13:15 GMT

MLA రాజాసింగ్‎పై పీడీయాక్ట్‌ కేసులపై వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైన రాజాసింగ్

MLA Raja Singh: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ చట్టం వ్యవహారంలో విచారణ జరిగింది. బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్‌ అతిథి గృహంలో పీడీ చట్టం సలహామండలి సమావేశమై ఈకేసును విచారించింది. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేయడానికి గల కారణాలను, ఆధారాలను మంగళ్‌హాట్‌ పోలీసులు ఇప్పటికే పీడీ చట్టం సలహామండలికి అందించారు. చర్లపల్లి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రాజాసింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు.

రాజాసింగ్‌ సతీమణి ఉషాబాయి, ఆయన తరఫు న్యాయవాది కరుణాసాగర్‌ సలహా మండలి ఎదుట హాజరయ్యారు. తనపై అక్రమంగా పీడీ చట్టం నమోదు చేసినట్టు రాజాసింగ్‌ సలహామండలి ఎదుట వాదనలు వినిపించారు. రాజాసింగ్‌ సతీమణి ఉషాబాయి కూడా దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న పీడీ చట్టం సలహామండలి తీర్పును రిజర్వ్‌ చేసింది. 3..4 వారాల్లో దీనిపై తీర్పు వెలువడే అవకాశం ఉందని రాజాసింగ్‌ తరఫు న్యాయవాది తెలిపారు.

Tags:    

Similar News