డీజీపీపై ఎమ్మెల్యే రఘునందన్ వ్యాఖ్యలను ఖండించిన ఐపీఎస్ అధికారుల సంఘం
MLA Raghunandan Rao: రఘునందన్ రావుపై స్పీకర్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
MLA Raghunandan Rao: డీజీపి అంజనీ కుమార్ పై MLA రఘునందన్ అనుచిత వ్యాఖ్యలు
MLA Raghunandan Rao: డీజీపి అంజనీ కుమార్ పై MLA రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఐపీఎస్ అధికారులు సంఘం తీవ్రంగా ఖండించింది. బీహార్ గుండా రాజ్యాన్ని తెలంగాణలో తెస్తాం అంటే ,అంజనీకుమార్ ని త్వరలోనే ఇక్కడి నుంచి పంపిస్తమంటూ రఘునందన్ వ్యాఖ్యలు చేశారు. అందుకు గానూ రఘునందన్ రావు పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి పైన ఇలాంటి బాధ్యత లేని వ్యాఖ్యల్ని చేయడం ఏంటని మండిపడ్డారు. అంతేకాకుండా, రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రజల భద్రత, భద్రత కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్న తెలంగాణ పోలీసులకు ఇలాంటి జుగుప్పాకరమైన వ్యాఖ్యలు చాలా నిరాశ కలిగించాయని ఐపీఎస్ అధికారుల సంఘం పేర్కొంది.