ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి
Manchireddy Kishan Reddy: విదేశాల్లో పెట్టుబడులు, లావాదేవీలపై ఆరా
ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి
Manchireddy Kishan Reddy: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇవాళ మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. నిన్న 9 గంటల పాటు విచారించిన అధికారులు.. విదేశాల్లో పెట్టుబడులు, లావాదేవీలపై ఆరా తీశారు. ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఉల్లంఘించినట్లు ఎమ్మెల్యేపై అభియోగం ఉంది. విదేశాల్లో పెట్టుబడులు, నగదు చెల్లింపులపై ఫోకస్ పెట్టిన ఈడీ.. ఇప్పటికే ఎమ్మెల్యే విదేశీ పర్యటన, ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి