Bathula Laxma Reddy: కొడుకు పెళ్లికి పెట్టాల్సిన డబ్బు రైతుల కోసం.. మిర్యాలగూడ ఎమ్మెల్యే గొప్ప మనసు

Bathula Laxma Reddy: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మరియు ఆయన కుటుంబం తమ నియోజకవర్గ రైతుల సంక్షేమం కోసం రూ.2 కోట్ల విరాళాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.

Update: 2025-09-18 05:49 GMT

Bathula Laxma Reddy: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మరియు ఆయన కుటుంబం తమ నియోజకవర్గ రైతుల సంక్షేమం కోసం రూ.2 కోట్ల విరాళాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు రూపంలో అందజేసిన లక్ష్మారెడ్డి, దీనిని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వడానికి ఉపయోగించాలని కోరారు.

కాగా, ఇటీవల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. ఈ సందర్భంగా భారీగా రిసెప్షన్ నిర్వహించాలనుకున్నప్పటికీ, ఆ ఖర్చును రద్దు చేసుకుని ఆ మొత్తాన్ని రైతుల కోసం విరాళంగా ఇచ్చారు. ఈ గొప్ప నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

Tags:    

Similar News