Siddipet: చిన్నకోడూరులో మిర్చి రైతులకు కొత్త సమస్య

పూత దశలో కొత్తరకం తెగులు సోకడంతో పంట నష్టం దిక్కుతోచని స్థితిలో మిర్చి పంట రైతులు ఎన్నిరకాల మందులు వాడిన ప్రయోజనం శూన్యం

Update: 2021-12-12 06:58 GMT

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు (మం) మిర్చి రైతులకు కొత్త సమస్య

Siddipet: సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మిర్చి రైతులకు కొత్త సమస్య వచ్చి పడ్డది. పూత దశలో ఉన్న మిర్చి పంటకు కొత్తరకం తెగులు సోకడంతో పంట భారీగా నష్టపోయే అవకాశాలున్నాయి. దాంతో రైతులు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే చాలా రకాల పురుగుల మందులు వాడినప్పటికి ప్రయోజనం లేకపోయింది.

కొత్తరకం వైరస్ సోకడంతో, మిరప చెట్టు తల్లి వేరు చనిపోవడం మిర్చి ఆకు ముడుత పోయి చివరికి చెట్టు ఎదగకుండా పూర్తిగా నాశనం అయిపోతుందని రైతులు వాపోతున్నారు. తక్షణమే వ్యవసాయాధికారులు పంటను వీక్షించి తగు సలహాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.





Tags:    

Similar News