ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్ట్ వద్దకు మంత్రులు
Medigadda Project: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సందర్శించనున్న మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు
ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్ట్ వద్దకు మంత్రులు
Medigadda Project: ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్ట్ వద్దకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు వెళ్లనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు మంత్రులు. ఈ నెల 29న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు బయల్దేరి వెళ్తారు ఉత్తమ్, శ్రీధర్‌బాబు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలపై సమీక్ష జరుపుతారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు, ప్రాజెక్ట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్, మేడిగడ్డ, సిందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ల సమస్యలు - వాటి పరిష్కారాలు, తదితర అంశాలపై సమీక్షిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లను సందర్శించనున్నారు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు. అక్కడ ఏర్పాటు చేసే సమావేశానికి హాజరుకావాలని ప్రాజెక్ట్‌ల నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు ప్రాజెక్ట్‌ల నిర్మాణంతో సంబంధం ఉన్నవారందరినీ సమావేశ పరిచేలా చూడాలని ఈఎన్‌సీని ఆదేశించారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.