Uttam Kumar: బియ్యం సప్లై విషయంలో లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి

Uttam Kumar: పేదలు ఉచిత బియ్యం తినకపోతే ఆ పథకం నిరుపయోగం అవుతుంది

Update: 2023-12-12 14:18 GMT

Uttam Kumar: బియ్యం సప్లై విషయంలో లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి

Uttam Kumar: పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం మొక్కుబడిగా కాకుండా.. లోపాలు ఎక్కడున్నాయో.. తెలుసుకోవాలని... సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సివిల్ సప్లై ముఖ్యకార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సరఫరా విషయంలో అధికారులు మరింత పారదర్శకంగా ఉండాలని సూచించారు. కిలో బియ్యం 39 రూపాయలు పెట్టి కొని.. ఉచితంగా ఇస్తున్నామని.. అవి ప్రజలు తినలేకపోతే.. ఈ ఉచిత పథకం నిరుపయోగమన్నారు.

బియ్యం పేదలకు ఎలా ఉపయోగకరమైన పథకంగా ఉంటుందో లేదో..అధ్యయనం చేయాలని.. రాష్ట్రములో ఉచిత బియ్యం లబ్దిదారుల నుంచి సమాచారం సేకరించాలని అధికారులకు సూచించారు. సివిల్ సప్లై శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలు అడిగిన మంత్రి.. రైస్ మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం ఎందుకు జరుగుతుందని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు.

Tags:    

Similar News