Uttam Kumar: L&T ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం

Uttam Kumar: తప్పుచేసినవారు తప్పించుకోవాలని చూస్తే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం

Update: 2023-12-18 12:33 GMT

Uttam Kumar: L&T ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం

Uttam Kumar: ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు పనులపై ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులతో సమావేశమైన ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. ప్రాజెక్టు పనులు నాసిరకంగా ఎలా చేస్తారని ఫైరయ్యారు. అంత పెద్ద ప్రాజెక్ట్‌లో నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారని నిలదీశారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్ట్ కూలడానికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్ ఏజెన్సీలతో కూడా మాట్లాడుతానన్న మంత్రి... తప్పుచేసినవారు తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News