Rythu Bharosa: రైతు భరోసాపై కీలక అప్ డేట్..మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే?
Rythu Bharosa: రైతు భరోసాపై కీలక అప్ డేట్..మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే?
Rythu Bharosa: రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బు జమ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలివిడతలో మండలానికి ఒక్కో గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు. సోమవారం 4,41,911 మంది రైతుల అకౌంట్లలో రూ. 569 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,48,333 ఎకరాలకు సంబంధించి మొత్తం 530కోట్ల రూపాయలు జమ చేశామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు పథకం ద్వారా మద్దతు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైందని తెలిపారు. ప్రతి ఎకరానికి రూ. 6వేల చొప్పున అర్హులైన రైతులందరికీ ఈ స్కీం వర్తింపచేస్తామని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ విధంగా రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఆదిలాబాద్ లో 17 మండలాలు 21 గ్రామాలు, 6,411 మంది రైతులకు రూ. 14.49కోట్లు భద్రాద్రి కొత్తగూడెం 23 మండలాలు 25గ్రామాలు 22,242 మంది రైతులకు రూ. 39.07కోట్లు జమ అయినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మొదటిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల వివరించారు. ఫిబ్రవరి నుంచి 51,912 మందికి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. పాత రేషన్ కార్డుల్లో అదనంగా 1.03లక్షల మందిని చేర్చారని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీం ప్రారంభంలో 20, 336 మంది భూమిలేని కూలీలకు నిధులు విడుదల చేశామని మంత్రి వివరించారు. ఈ చర్యలన్నీ ఎన్నిలక హామీల అమల్లో భాగమని రైతులకు సంపూర్ణ మద్దతు అందించడమే లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.