Telangana Budget 2025-26: రైతు భరోసా పథకానికి రూ. 18 వేల కోట్లు

Telangana Govt Allocates 18k Crore for Rythu Bharosa
x

Telangana Budget 2025-26: రైతు భరోసా పథకానికి రూ. 18 వేల కోట్లు

Highlights

Telangana Budget 2025-26: రైతు భరోసా పథకానికి తెలంగాణ బడ్జెట్ 2025-26 వార్షిక బడ్జెట్ లో రూ. 18 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది.

Telangana Budget 2025-26: రైతు భరోసా పథకానికి తెలంగాణ బడ్జెట్ 2025-26 వార్షిక బడ్జెట్ లో రూ. 18 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎన్నికల సమయంలో రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూ.12వేలను పెట్టుబడి సాయంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగా రైతు భరోసా కింద రైతులకు ఆర్ధిక సహాయం చేయనున్నారు. 2025 జనవరి 26న తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ భూములకు రైతుబంధు పథకం కింద ఆర్ధిక సహాయం చేశారు. వ్యవసాయం చేసినా చేయకపోయినా ఈ స్కీం కింద నిధులు అందించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సాగుకి యోగ్యమైన భూములకు రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. గ్రామసభల్లో సాగు యోగ్యం కాని భూములను గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories