Talasani Srinivas: హుస్సేన్ సాగర్‌ను పరిశీలించిన మంత్రి తలసాని.. GHMC లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం
Talasani Srinivas Yadav: అన్ని స్థాయిలలోని అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్నారు
Talasani Srinivas: హుస్సేన్ సాగర్‌ను పరిశీలించిన మంత్రి తలసాని.. GHMC లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం
Talasani Srinivas Yadav: హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ కలిసి హుస్సేన్ సాగర్‌ను పరిశీలించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని స్థాయిలలోని అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని చెప్పారు. హుస్సేన్ సాగర్ రిజర్వాయర్‌కు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. SNDP కార్యక్రమంతో అనేక ప్రాంతాల్లో వరద ముంపు సమస్య తొలగిపోయిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.